కె24న్యూస్ తెలుగు ప్రతినిధి (రాజేష్ కుమార్) నవంబర్ 04. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గం పెనుమురు మండలం జెట్టిగుండ్లపల్లి హరిజనవాడకు చెందిన కె.చందు మరియు కె.జాన్సీ దంపతుల ఒక సంవత్సరం కుమారుడు కె.జతిన్ తీవ్రమైన ఆరోగ్య సమస్యతో పోరాడుతున్నాడు. వైద్య పరీక్షల్లో అతనికి క్రానిక్ గ్రాన్యులోమాటస్ డిసీజ్ అనే అరుదైన, ప్రాణాంతకమైన రోగనిరోధక లోప వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడు సాధారణ జీవితాన్ని గడపాలంటే అత్యవసరంగా అలోజెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్టాంట్ చేయాలని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ఈ వైద్య చికిత్స మరియు అనంతర సంరక్షణ కోసం సుమారు 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో ఇప్పటికే తమ వద్ద ఉన్న వనరులన్నింటినీ వైద్యం కోసం ఖర్చు చేశారు. ప్రస్తుతం తదుపరి చికిత్సకు అవసరమైన భారీ మొత్తాన్ని సమకూర్చుకోలేక ఆ తల్లితండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో ఉన్న దాతలు, మానవతావాదులు స్పందించి చిన్నారి జతిన్ ప్రాణాలను కాపాడేందుకు ఆర్థికంగా చేయూతనందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చిన్న సహాయం కూడా ఆ బాలుడికి పునర్జన్మ ప్రసాదిస్తుందని వారు విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారం కోసం సహాయం చేయదలుచుకున్న వారు 8919338515 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.