K24 News Telugu
Date of Publish : 04/11/2026, 5:17 pm
Published By srikanth

విషాద సమయంలో అండగా అన్నపూర్ణ సేవారథం టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

  • అంత్యక్రియలకు వచ్చే బంధుమిత్రులకు ఉచిత భోజన సదుపాయం.. జీసీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమం

కామారెడ్డి జిల్లా నవంబర్ 4: k24 న్యూస్ తెలుగు :     కుటుంబంలో ఆప్తులను కోల్పోయి విషాదంలో ఉన్న సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత భోజన సేవను ప్రారంభించారు. ఆప్తుల అంత్యక్రియల సమయంలో ఇంటికి వచ్చే బంధుమిత్రులకు భోజన ఏర్పాట్లు చేయడం కుటుంబ సభ్యులకు అదనపు భారంగా మారకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ సేవ అవసరమైన కుటుంబాలు *జి సి ఆర్ ట్రస్ట్‌కు* సమాచారం అందిస్తే, అన్నపూర్ణ సేవారథం ద్వారా ఉచితంగా భోజనాన్ని వారి ఇంటి వద్దకే తీసుకువచ్చి అందించనున్నారు. కష్ట సమయంలో కుటుంబాలకు అండగా నిలవడం, వారి ఇబ్బందులను కొంతవరకు తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని GCR ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.

ఈ సేవను అవసరమైన ప్రతి కుటుంబం వినియోగించుకోవచ్చని, సమాచారం కోసం 9536000333 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ సేవా కార్యక్రమం గురించి ఇతరులకు కూడా తెలియజేసి అవసరమైన వారికి సమాచారం చేరవేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో,టి పి సి సి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ, కామారెడ్డి జిల్లా సేవాదళ్ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ గడ్డమీది మహేష్,తాటి ప్రసాద్,డిసిసి ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, సేవాదళ్ నియోజకవర్గం అధ్యక్షులు మెహర్ బాబాగౌడ్ , కామారెడ్డి మాజీ కౌన్సిలర్లు, జమీల్, చింతల రవీందర్ గౌడ్, చాట్ల వంశీ, రంగా రమేష్ గౌడ్ మాధవి,శ్రీధర్ రావు,బండారి శ్రీకాంత్, అరవింద్, ఆబిద్, కామారెడ్డి మండల సేవాదళ్ అధ్యక్షులు, హరీష్, వేణు, ప్రణీత్, ప్రవీణ్, యూత్ నాయకులు, రాహుల్, శశి, పండు శ్రీకాంత్ పాల్గొన్నారు .

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save