K24 News Telugu
Date of Publish : 04/11/2026, 6:18 pm
Published By Katta Ravinder

రామారావుపేట గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో

  • రూఫ్ వాటర్ హార్వెస్టింగ్, బోర్‌వెల్ రీచార్జ్ పనుల పరిశీలన

జైపూర్, నవంబర్ 4 (తెలుగు కే న్యూస్):

జైపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీపతి బాపురావు బుధవారం రామారావుపేట గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

VBGRAMG పథకంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ నిర్మాణానికి ముగ్గు పోశారు. అదేవిధంగా బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్ పనులను పరిశీలించారు.

అనంతరం గెజిటెడ్ వెరిఫికేషన్‌లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి యాప్ ద్వారా తనిఖీలు నిర్వహించారు.

ఈ పర్యటనలో గ్రామ సర్పంచ్ పులి రాజశేఖర్, ఈసీ రాజమౌళి, పంచాయతీ కార్యదర్శి రజిత, వార్డు సభ్యులు, సీనియర్ మేట్ సురేష్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save