K24 News Telugu
Date of Publish : 24/10/2026, 9:07 am
Published By Katta Ravinder

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలి

  • జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్

కామారెడ్డి జిల్లా అక్టోబర్ 24 :k24 న్యూస్ తెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలి

రెండో విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో భాగంగా కొత్తగా ఇళ్లు మంజూరైన అటికెల భూమయ్య, గణేష్‌లకు మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం పేదలకు సొంతింటి కల్పనే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు మంజూరైన ఇళ్లను నిబంధనల ప్రకారం నిర్మించుకోవాలని సూచించారు. ఇళ్ల నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు.

ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు తమ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం చేకూరేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో DRDO దామోదర్ రెడ్డి గారు, మండల ప్రత్యేక అధికారి శ్రీకాంత్, ఎంపీడీవో నాగేశ్వర్, తహశీల్దార్ ఉమలత, Ae Pr సురేష్, Ae Rws విష్ణువర్ధన్, Ae Transco సుధాకర్, Apo ధర్మారెడ్డి సర్పంచ్ కిషన్ యాదవ్ , ఉప సర్పంచ్ మధుకర్ మరియు పంచాయతీ కార్యదర్శి పాపిరెడ్డి పాల్గొన్నారు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save