K24 News Telugu
Date of Publish : 24/10/2026, 7:42 pm
Published By Katta Ravinder

కొంపల్లిలో కుక్కపై ఓ వ్యక్తి లైంగిక దాడి..

  • క్యాబిన్‌లోకి తీసుకెళ్లి అఘాయిత్యం

 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సాయినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి, కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్టోబర్ 8వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అక్టోబర్ 8వ తేదీన అపార్ట్‌మెంట్ ఆవరణలో తిరుగుతున్న ఓ ఆడ కుక్కను, సంజయ్ తివారీ (50) అనే సెక్యూరిటీ గార్డు తన శాలువాలో బంధించి సెక్యూరిటీ క్యాబిన్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లుగా సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు వివరాలు సేకరించి పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By K24NewsTelugu
PDF Share Save