కరీంనగర్ జిల్లాలో తెలుగు కే న్యూస్ తెలంగాణ రక్షణ సేనను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవితమ్మ పిలుపునిచ్చారు. ఇటీవల కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్‌గా లింగంపల్లి నాగరాజు, కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జ్‌గా అంకం శివరాణి నియమితులైన సందర్భంగా వారు జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్‌తో కలిసి కవితమ్మను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కవితమ్మ మాట్లాడుతూ గ్రామస్థాయి కమిటీల నిర్మాణం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని నాయకులకు సూచించారు. అలాగే నూతనంగా నియమితులైన ఇంచార్జ్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమావేశంలో పలువురు జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.