తెలుగు కే న్యూస్ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై ప్రస్తుతం కోలుకొని వనస్థలిపురంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేష్‌ను శాసన మండలి ప్రతిపక్ష నేత ఎస్. మధుసూదనాచారి, ఎస్. శివప్రకాష్ పరామర్శించారు.
ఈ సందర్భంగా మల్లేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వారు, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.