
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం జులై 07, తెలుగు కే న్యూస్ ప్రతినిధి,
ఆర్మూర్ పట్టణం లోని పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య ఐపీఎస్ మాట్లాడుతూ,
Cr.No.74/2026, U/s 303(2) BNS & Sec 3 of PDPP act of Velpoor PS
*నిందితుల వివరాలు :*
1. కర్రే వినోద్ కుమార్, 26 సం
2. అండ్రాసి నవీన్, 28 సం:
3. గుంజోల్ల ఈశ్వర్, 27 సం;
4. బాజ హరిప్రసాద్, 28సం;
5. కర్రే విజయ్ కుమార్,28 సం;
6. మూల దుర్గాప్రసాద్ రెడ్డి, వయస్సు: 32 సం;
7. అబ్దుల్ వసీం హైమద్ @ తిల్లి బాబా 43సం: వృత్తి: స్క్రాప్ బిజినెస్, అంగడి బజార్, ముగ్దూం నగర్, ఆర్మూర్ (దొంగ సొత్తు సేకరించిన నిందితుడు)
*కేసు వివరాలు*
నిందితులు అయిన 1. కర్రే వినోద్ కుమార్ 2. అండ్రాసి నవీన్, 3. గుంజోల్ల ఈశ్వర్ 4. బాజ హరిప్రసాద్, 5. కర్రే విజయ్ కుమార్ 6. మూల దుర్గాప్రసాద్ రెడ్డి అందరూ పోచమ్మ గల్లీ, ఆర్మూర్ కి చెందిన వీరు కలిసి తిరుగుతూ జల్సాలకు అలవాటు పడినారు. వినోద్ మరియు విజయ్ లు అన్నదమ్ములు పాత ఇనుప్ సామానులు ఆర్మూర్ చుట్టుపక్కల కొనుగోలు చేస్తూ అబ్దుల్ వసీం @ తిల్లి బాబా కు ఇనుప సామానులు అమ్మేవారు. అయితే స్క్రాప్ యజమాని, పాత నేరస్తుడు అయిన అబ్దుల్ వసీం @ తిల్లి బాబ యొక్క సలహాతో వేల్పూర్, బాల్కొండ, మెండోర, భీంగల్, ఆర్మూర్, ఏర్గట్ల, పోలీసు స్టేషన్ పరిధిలో వినోద్ మరియు విజయ్ లు పగటి సమయంలో స్క్రాప్ కొనుగోలు చేస్తున్న నెపంతో గ్రామాల శివార్లలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి, పై ఆరుగురు నిందితులతో ఒక మూఠగ ఏర్పడి రాత్రి వేళల్లో పై వ్యక్తులు ఆరుగురు కలిసి అందులోని రాగి కాయిల్స్‌ను దొంగిలించి, అట్టి రాగి ని ఆర్మూర్ కి చెందిన స్క్రాప్ వ్యాపారి అబ్దుల్ వసీం @ తిల్లి బాబ కి విక్రయిస్తూ, అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. తెలిపారు, అబ్దుల్ వసీం @ తిల్లి బాబ పై గతములో ఆర్మూర్ పి.ఎస్, మెండోర పి.ఎస్, నిజామాబాద్ నాలుగవ టౌన్ పి.ఎస్ లలో చోరీ సొత్తు కొన్న కేసులు కలవు. నిందితులు వేల్పూర్ పి.ఎస్ లో 4 కేసులు, బాల్కొండ లో 5 కేసులు, మెండోర లో 3 కేసులు, భీంగల్ లో ఒక కేసు, ఆర్మూర్ లో 5 కేసులు, ఏర్గట్ల పి.ఎస్ లో ఒక కేసు, మొత్తం 19 కేసులలో పాల్గొన్నారు. పై అరుగురుని జులై 07. నాడు ఉదయం, పసుపు బోర్డ్ పక్కన పాత బి టి రోడ్, పడగల్ గ్రామశివారులో రైల్వే బ్రిడ్జ్ వద్ద పట్టుకోనైనది.చోరీ సొత్తు కొనుగోలు చేసే నిందితుడు అబ్దుల్ వసీం @ తిల్లి బాబా ని కూడ ఆర్మూర్ లో పట్టుకోనైనది తెలియజేశారు.
*నిందితులు చేసిన నేరముల వివరములు*
1) Cr. No 74/2026 u/s 303 (2) BNS & Sec 3 PDPP act of PS velpoor
2) Cr. No 04/2026 U/s 303 (2) BNS, Sec 136 ELA act of PS Mendora
3) Cr. No 19/2026 U/s 303 (2) BNS of PS Balkonda
4) Cr. No 33/2026 U/s 303 (2) BNS of PS Velpoor
5) Cr. No 29/2026 U/s 303 (2) BNS of PS Balkonda
6) Cr. No 208/2026 U/s 303 (2) BNS of PS Armoor
7) Cr. No 237/2026 U/s 303 (2) BNS of PS Armoor
8) Cr. No 60/2026 U/s 303 (2) BNS of PS Velpoor
9) Cr. No 50/2026 U/s 303 (2) BNS of PS Balkonda
10) Cr. No 52/2026 U/s 303 (2) BNS of PS Balkonda
11) Cr. No 300/2026 U/s 305 (e) BNS & Sec 3 PDPP act of PS Armoor
12) Cr. No 70/2026 U/s 303 (2) BNS of PS Balkonda
13) Cr. No 71/2026 U/s 303 (2) BNS of PS Balkonda
14) Cr. No 115/2026 U/s 305 (a) BNS & Sec 136 ELA act of PS Bheemgal
15) Cr. No 345/2026 U/s 303 (2) BNS & Sec 3 PDPP act of PS Armoor
16) Cr. No 61/2026 U/s 303 (2) BNS & Sec 136 ELA act of PS Mendora
17) Cr. No 369/2026 U/s 303 (2) BNS & Sec 3 PDPP act of PS Armoor
18) Cr. No 63/2026 U/s 303 (2 BNS, Sec 136 ELA act of PS Mendora
19) 25/2026 U/s 305 (2) BNS of PS Ergatla
*స్వాధీనం చేసుకున్న సొత్తు, పోలీసులు నిందితుల వద్ద నుండి క్రింది వస్తువులను స్వాధీనం చేసుకున్నారు*
1) బజాజ్ మాక్సిమా ట్రాలీ ఆటో (TS-16-T-5741)
2) హోండా షైన్ మోటార్ సైకిల్ (AP-28-CL-1677)
3) యమహా స్కూటీ (TS-16-FG-4115)
4) బజాజ్ డిస్కవర్ మోటార్ సైకిల్
5) 5 మొబైల్ ఫోన్లు
6) దొంగతనం చేయుటకు ఉపయోగించిన పనిముట్లు
7) రాగి తీగ – 74 కిలోలు
*ఈ కేసుని చేదించుటలో ముఖ్య పాత్ర వహించిన వారు.*
1) .జి.జాన్ రెడ్డి,CIP,ఆర్మూర్ రూరల్ సర్కిల్ ,నిజామాబాద్ జిల్లా,
2) బి. సంజీవ్ SIP, PS వేల్పూర్
3) కె.శైలెందర్, SIP, PS బాల్కొండ,
4) భరత్ గౌడ్,PC మెండోర PS
5) నరేంధర్, HC వేల్పూర్ PS
6) హరీష్, PC ముప్కాల్ PS
7) సాయి కిరణ్, వేల్పూర్ PS
8) పి. శ్రావణ్, PC వేల్పూర్ PS
9) సుధర్శన్, HC వేల్పూర్ PS లను *నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్.,* అభినందించినారు.