Logo
Date of Publish : 29 June 2026, 6:59 am
Editor : Katta Ravindar

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దళిత జర్నలిస్టుల హౌస్ అరెస్ట్

కామారెడ్డి, K24 న్యూస్ తెలుగు జూన్ 29:జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్‌లోని ఐ&పీఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి వెళ్లేందుకు సిద్ధమైన కామారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టుల అసోసియేషన్ నాయకులను పోలీసులు సోమవారం హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెడ్డు సాయిలు మాట్లాడుతూ, ఉద్యమంలో పాల్గొనకుండా ముందుగానే ఇళ్ల వద్దకు వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని విమర్శించారు. జర్నలిస్టుల న్యాయమైన హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన ఆరోపించారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఉద్యమాన్ని అణచివేయడం సరైన పద్ధతి కాదని, తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )