Date of Publish : 30 June 2026, 11:11 am
Editor : Katta Ravindar
క్షత్రియ సమాజ్ ఎన్నికలలో అధ్యక్షునిగా ఘన విజయం సాధించిన న్యాయవాది ఆనంద్*

- నిజామాబాద్ జిల్లా,
ఆర్మూర్ మండలం, జూన్ 30 తెలుగు కే న్యూస్ ప్రతినిధి,
ఆర్మూర్ పట్టణంలో, శ్రీ సోమవంశ సహస్రర్జున క్షత్రియ సమాజ్ ఖత్రి కులస్తులు ఎక్కువగా నివాసం ఉంటారు.ఆర్మూర్ పట్టణంలో గల అతిపెద్ద కులాలలో ఒకటిగా ఖత్రి క్షత్రియులను పరిగణిస్తారు. అంత పెద్ద సమాజానికి అతిపిన్న వయసులో ప్రముఖ న్యాయవాది సామాజిక కార్యకర్త గటడి ఆనంద్ అత్యధిక మెజారిటీతో ఎస్ ఎస్ కె సమాజ్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.పట్టణంలోని చిన్న బజార్ వద్ద గల శ్రీ దత్తాత్రేయ లక్ష్మీనారాయణ మందిరంలో 28 జూన్ ఆదివారము నాడు జరిగిన ఎస్ ఎస్ కే సమాజ్ త్రై వార్షిక ఎన్నికలలో గటడి ఆనంద్ కు 631 ఓట్లు వచ్చినవి. తన ప్రత్యర్థి పై 226 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. తన విజయం ప్రజల విజయమని సమాజ సేవకు, కట్టుబడి సమాజాభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. క్షత్రియ సమాజ్ ఎన్నికలలో ఘన విజయం సాధించినందుకు ఆనంద్ కి అభినందనల వెల్లువ కొనసాగుతుండటంతో, ఈ అభిమానాన్ని మరిచిపోనని సమాజ సభ్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
*గటడి ఆనంద్ వ్యక్తిగతం*
పేద కుటుంబం నుండి వచ్చిన గటడి ఆనంద్ కష్టపడి చదివి న్యాయస్థానంలో పట్టా పొంది ఆర్మూర్ బార్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకొని న్యాయవాదిగా తన జీవితాన్ని ప్రారంభించి సమాచార హక్కు చట్టం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని సంకల్పంతో ఆర్మూర్ ప్రాంతంలోని ప్రతి ఊరిలో ప్రతి కళాశాలలో సమాచార హక్కు చట్టం సదస్సులు నిర్వహించి ఈ చట్టాన్ని ప్రజల్లో తీసుకెళ్లిన సామాజిక సేవకుడిగా గుర్తింపు ఉంది. ఎన్నో సంస్థలకు, బ్యాంకులకు న్యాయ సలహాదారునిగా తన సేవలు అందిస్తున్నారు. తాజాగా ఎన్ పి డి సి ఎల్ నిజామాబాద్ జిల్లా న్యాయ సలహాదారునిగా నియమితులయ్యారు. తన పేరు ప్రఖ్యాతులే ఆర్మూర్ ఎస్ ఎస్ కే సమాజ్ ఎన్నికలలో అఖండ విజయం సాధించడానికి దోహద పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.