Logo
Date of Publish : 04 September 2026, 6:00 am
Editor : Katta Ravindar

జూబ్లీహిల్స్ సొసైటీ ఎన్నికల్లో రవీంద్రనాథ్ ప్యానల్ ఘన విజయం

 

15కు 15 స్థానాల్లో క్లిన్ స్వీప్.. ఫలితాల అధికారిక ప్రకటనపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలుగు న్యూస్ సెప్టెంబర్ 4: జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల్లో బొల్లినేని రవీంద్రనాథ్ ప్యానల్ విజయ డంకా మోగించింది. మొత్తం 15 డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రవీంద్రనాథ్ ప్యానల్ అభ్యర్థులు 15 స్థానాల్లోనూ విజయం సాధించినట్లు సమాచారం.2021లో జరిగిన ఎన్నికల్లోనూ 15కు 15 స్థానాలకు కైవసం చేసుకున్న రవీంద్రనాథ్ ప్యానల్.. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ అదే స్థాయిలో ఫలితాలను సాధించింది. ఈ విధంగా వరుసగా రెండుసార్లు సొసైటీ డైరెక్టర్ స్థానాలకు ఎంపికైన తమ ప్యానల్ గెలిచినట్లయింది.కౌంటింగ్ ప్రక్రియ పూర్తయినప్పటికీ, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు అధికారులు అధికారికంగా ప్రకటించలేదని సమాచారం. దీంతో అధికారిక ప్రకటనపై సభ్యుల్లో ఉత్కంఠ.గత ఐదేళ్లలో సొసైటీ అభివృద్ధికి పలు చర్యలు చేపట్టడంతో పాటు, సొసైటీకి సంబంధించిన భూముల పరిరక్షణకు కృషి చేశామని రవీంద్రనాథ్ ప్యానల్ ప్రకటించారు. సుమారు రూ.2 వేల కోట్ల విలువైన సొసైటీ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకున్నామని వారు తెలిపారు.సొసైటీ అభివృద్ధి, భూముల పరిరక్షణ, సభ్యుల సంక్షేమం వంటి అంశాలను తీసుకుని సభ్యులు తమ ప్యానల్‌కు మద్దతుగా ఓటు వేశారని రవీంద్రనాథ్ ప్యానల్ నాయకులు పేర్కొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )