Logo
Date of Publish : 09 July 2026, 4:25 pm
Editor : Katta Ravindar

తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి ఇకలేరు,

నిజామాబాద్ జిల్లా, మెండోరా గ్రామం, జులై 09, తెలుగు కే న్యూస్ ప్రతినిధి,
బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని మెండోరా గ్రామంలో గురువారం రోజు సాయంత్రం దాసరి మూర్తి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మెండోరాలో తన స్వగృహంలో గుండెపోటుతో స్వర్గస్తులయ్యారు, వారి మృతి యావత్ తెలంగాణ బిసి సంక్షేమ సంఘం తీరని లోటు దాసరి మూర్తి బీసీలకు చేసిన సేవలు మాటల్లో చెప్పలేనిది, వారు ప్రతినిత్యం బీసీల సంక్షేమం కోసం బీసీల ఐక్యమత్యత బీసీల రాజ్యాధికారం బీసీల రిజర్వేషన్ల కోసం తన అలుపెరుగని పోరాటం చేస్తూ జీవిస్తూ బీసీలను ఐక్యమత్యం చేస్తూ వచ్చారు, బుధవారం రోజున ప్రెస్ మీట్ లో పేద విద్యార్థుల
పీజు రియాంబర్షుమెంట్ వెంటనే విడుదల చేయాలి, తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం దాసరి మూర్తి డిమాండ్ చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించే మనస్తత్వం అయినది, ఆయన జీవిత ఆశయం బీసీలకు రాజ్యాధికారం కోసం రిజర్వేషన్ల కోసం ఎల్లప్పుడు మాట్లాడుతూ, ఉండేవారు. ఈరోజు ఆయన లేని లోటు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తీరనిలోటు తన సన్నిహితులు శోకసముద్రంతో తమ ఆవేదన వ్యక్తం చేశారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )