Logo
Date of Publish : 21 August 2026, 5:31 pm
Editor : Katta Ravindar

ద్విచక్ర వాహనాలు దారులకు హెల్మెట్ తప్పనిసరి – ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు వాహనం సీజ్ ఎస్ఐ జి. మహేష్ వెల్లడి.

నిజామాబాద్ జిల్లా,
జక్రాన్‌పల్లి మండలం, ఆగస్టు 21 తెలుగు కే న్యూస్ ప్రతినిధి,

జక్రాన్‌పల్లి మండల పరిధిలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని జక్రాన్‌పల్లి ఎస్‌ఐ జి. మహేష్ ప్రజలకు తెలిపారు,
తేదీ 22-08-2026 నుండి హెల్మెట్ నిబంధనను కఠినంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ద్విచక్ర వాహనం నడిపే రైడర్‌తో పాటు పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కేవలం జరిమానాతో సరిపెట్టకుండా, చట్టపరమైన నిబంధనల మేరకు వాహనాన్ని సీజ్ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారుల ప్రాణాలను కాపాడటంలో హెల్మెట్ అత్యంత కీలకమైన భద్రతా సాధనమని, “జరిమానా తప్పించుకోవడానికి కాదు – ప్రాణం కాపాడుకోవడానికి హెల్మెట్ ధరించాలి” అని ఎస్‌ఐ సూచించారు.
ఒక్కసారి జరిగిన ప్రమాదం ఒక కుటుంబం మొత్తాన్ని విషాదంలోకి నెట్టవచ్చని, మీ కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యుల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, ప్రతి ప్రయాణంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ప్రజలను కోరారు.
“మీ గమ్యం కంటే మీ ప్రాణం ముఖ్యం.
హెల్మెట్ ధరించండి – సురక్షితంగా ఇంటికి చేరండి.
మీ కుటుంబానికి మీరు అవసరం.
కావున జక్రాన్‌పల్లి మండల ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి, రైడర్ మరియు పిలియన్ రైడర్ ఇద్దరూ నాణ్యమైన హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని జక్రాన్‌పల్లి ఎస్‌ఐ జి. మహేష్ తెలిపారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )