Logo
Date of Publish : 28 June 2026, 7:39 am
Editor : Katta Ravindar

పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ తగిన గౌరవం ఇవ్వలేదు: కల్వకుంట్ల కవిత

కె 24 న్యూస్ తెలుగు తెలంగాణ నుంచి ప్రధానిగా ఎన్నికై దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు దక్కాల్సిన గౌరవాన్ని ఎన్నడూ ఇవ్వలేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు.

పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్లే దేశం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి చేరుకుందని ఆమె పేర్కొన్నారు. అలాంటి మహానేత మేధస్సును కాంగ్రెస్ పార్టీ గౌరవించకపోవడం ఆ పార్టీ కుసంస్కారానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

తెలంగాణ స్వాభిమానాన్ని ఢిల్లీలో చాటిన పీవీ నరసింహారావును ఈ నేల ఎన్నటికీ మరవదని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి సంస్థ తరఫున ప్రతి సంవత్సరం ఆయన జయంతి, వర్థంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆయన సేవలను స్మరించుకుంటున్నామని తెలిపారు.

పీవీ నరసింహారావు తమకు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయుడేనని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అడుగుజాడల్లోనే పాలన సాగిస్తామని చెప్పారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే పీవీకి అందించే నిజమైన ఘన నివాళి అని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )