Logo
Date of Publish : 01 October 2026, 11:38 am
Editor : Katta Ravindar

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా కలిగోట్ ప్రశాంత్.

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, సెప్టెంబర్ 30 తెలుగు కే న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్ పట్టణానికి చెందిన బీజేవైఎం సీనియర్ నాయకుడు కలిగోట్ ప్రశాంత్‌ ను బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ, పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు కలిగోట్ ప్రశాంత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ప్రశాంత్ పేర్కొన్నారు. బీజేపీ విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, పార్టీ కార్యకర్తలతో సమన్వయంతో పనిచేస్తానన్నారు.
పార్టీ ఇచ్చిన బాధ్యతలను నిబంధనలకు అనుగుణంగా నిర్వర్తిస్తూ, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కలిగోట్ ప్రశాంత్ తెలిపారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )