నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, జులై 21 తెలుగు కె న్యూస్ ప్రతినిధి,
ఆర్మూర్ పట్టణానికి చెందిన రాజు గౌడ్ ను ఈ ఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఈ ఆర్ రాజశేఖర్ మాట్లాడుతూ, రాజు గౌడ్ చేపట్టిన సైకిల్ యాత్ర కొన్ని వేల కిలోమీటర్లు పూర్తి చేయడం, సాహసోపేతం అని అభినందించారు. ధర్మకార్యాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ, విశ్వవ్యాప్తం చేసేందుకు తాను చేస్తున్న శ్ర ఆర్మూర్ పట్టణానికే గర్వకారణం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు కె.వి.ఆర్, రామ్ చందర్, బ్యాంకు నవీన్, జీవన్, తదితరులు పాల్గొన్నారు