Logo
Date of Publish : 08 August 2026, 11:50 am
Editor : Katta Ravindar

రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తావు రేవంత్ రెడ్డి సర్కార్..? బిఆర్ఎస్ మహిళా సీనియర్ నాయకురాలు పూర్రి స్వరూప

ములుగు జిల్లా:k24 న్యూస్ తెలుగు

రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తావు రేవంత్ రెడ్డి సర్కార్..?

జాబ్ క్యాలెండర్ ఏమైంది..?

నిరుద్యోగులను నిట్ట నిలువునా మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్

నిరుద్యోగులకు నయా వంచన మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు నిరుద్యోగులను నిండా ముంచడం దుర్మార్గమైన పరిస్థితి అని అన్నారు
ఆనాడు కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా మేము వచ్చిన సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మోసపూరితమైన హామీ ఇచ్చి నేటికీ నెరవేరని రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీ.
కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాల కాలంలో 16,978 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసినారు. స్వయానా అసెంబ్లీలో స్పీకర్ గారే చెప్పినారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము 60000వేల ఉద్యోగాలు భర్తీ చేసినామని మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే పచ్చి మోసం రాష్ట్రము లో ఉండదని అన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 60 వేలy ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాయించి రిజల్ట్ వెయిటింగ్ లో పెట్టిన వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళ అకౌంట్లో వేసుకోవడం మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డని చెప్పుకోవడం తప్ప ఏమీ లేదని అన్నారు.
ములుగు లో వాళ్ళ అగ్ర నాయకత్వంతో యూత్ డిక్లరేషన్ పేరుమీద అనేకమైన హామీల ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి.

జాబ్ క్యాలెండర్ జో క్యాలెండర్ గా మారిపోయింది.
నిరుద్యోగులకు 4 నిరుద్యోగ భృతి పచ్చి మోసం.
మెగా డీఎస్సీ వేస్తామని చెప్పడం పచ్చి మోసం..
20 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఈనాడు 7వేలకే నోటిఫికేషన్ ఇవ్వడం సిగ్గుచేటు.
విద్యార్థులకు 10 లక్షల విద్య భరోసా కార్డు ఇస్తామని చెప్పి మోసం.
విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తా అని చెప్పి పచ్చి మోసం.
పరిశోధన చేసే విద్యార్థులకు నెలకు పదివేల స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పి మోసం.
చదువుకునే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి,ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి, ఎంఫిల్ పాస్ అయితే స్కాలర్షిప్లు ఇస్తామని పచ్చి మోసం.

ఈ రాష్ట్రములో 15 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు కాలేజీలలో చదువుకుంటూ ఉంటే వారికి పదివేల కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా ఇవాళ వాళ్ళ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం..

తక్షణమే విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే భవిష్యత్తులో కచ్చితంగా వారి పక్షాన BRS పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరిస్తూ డిమాండ్ చేశారు..


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )