బంధువుల ఆందోళన.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
హైదరాబాద్, యూసఫ్‌గూడా:K24 న్యూస్ తెలుగు
యూసఫ్‌గూడా ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాలకుర్తి సదానందం అనే వ్యక్తి వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న క్రమంలో సమీపంలోని ఓ భవన సూపర్వైజర్ వాటర్ ట్యాంక్ శుభ్రం చేయాలని కోరినట్లు సమాచారం.
ట్యాంక్‌లో నిచ్చెన ఏర్పాటు చేసినట్లు చెప్పి సదానందాన్ని లోపలికి దింపగా, అక్కడ ఎలాంటి నిచ్చెన లేదా భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ట్యాంక్‌లో ఉన్న మోటార్ విద్యుత్ వైర్ తగలడంతో సదానందానికి తీవ్ర కరెంట్ షాక్ తగిలింది.
వెంటనే అక్కడున్న సూపర్వైజర్ సదానందాన్ని సమీప ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతుడు ఎరుకల కులానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి, అనంతరం ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు నమోదు చేసి, ఘటనకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.