Logo
Date of Publish : 13 June 2026, 8:01 am
Editor : Katta Ravindar

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి: బీఎస్పీ

సిద్దిపేట, జూన్ 13 (తెలుగు కే న్యూస్):
సిద్దిపేట జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక ఫీజుల భారం మోపుతున్నాయని, వాటిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) డిమాండ్ చేసింది.
శనివారం సిద్దిపేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి యాదగిరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎల్‌కేజీ, యూకేజీ స్థాయిలోనే భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
పాఠశాలలు ప్రారంభం కాకముందే పుస్తకాలు, యూనిఫాంలను తమ సంస్థలలోనే అధిక ధరలకు విక్రయిస్తూ విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న విద్యాసంస్థలను గుర్తించి సీజ్ చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
డిమాండ్లను పట్టించుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రోమాల బాబు, సిద్దిపేట అసెంబ్లీ ఇన్‌చార్జి పంగ బాబు, బబూత్ అధ్యక్షుడు లతానియల్ తదితరులు పాల్గొన్నారు.

 


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )