హైదరాబాద్, జూన్ 21 (కే24 న్యూస్): సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డిపిఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీని హైదరాబాద్లో జరిగిన పార్టీ స్థాపన దినోత్సవ వేడుకల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు మహమ్మద్ షఫీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఎస్డిపిఐ కట్టుబడి పనిచేస్తోందన్నారు.
మహిళలు రాజకీయాల్లో మరింత చురుకుగా పాల్గొనాలని నాయకురాలు సాహిబా మినాయ్ పిలుపునిచ్చగా, జాతీయ ప్రధాన కార్యదర్శి రియాజ్ ఫరంగిపేటె తెలంగాణలో ఎస్డిపిఐ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని పేర్కొన్నారు.
నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా సయ్యద్ మన్సూర్ షా ఎన్నికయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, సంస్థాగత బలోపేతం కోసం పార్టీ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కొత్త రాష్ట్ర కమిటీ సభ్యులను ప్రకటించారు.