
కె24 న్యూస్ తెలుగు జూన్ 19. ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫోర్స్ (POHRF) సంస్థ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పి. వెంకటరమణయ్య నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ జాతీయ అధ్యక్షులు కేశవులు అర్థాల మరియు జాతీయ మహిళా అధ్యక్షురాలు అర్థాల ధన్యవాణి సంయుక్తంగా ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. సామాజిక సేవా రంగంలో ఆయనకున్న చొరవను, నిబద్ధతను గుర్తించి, నెల్లూరు జిల్లాలో సంస్థను బలోపేతం చేసేందుకు ఈ కీలక బాధ్యతను అప్పగించినట్లు ఫౌండర్& ప్రెసిడెంట్ బండి పట్టాభిరెడ్డి జాతీయ నాయకత్వం పేర్కొంది. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నెల్లూరు జిల్లా అధ్యక్షులు పి.వెంకటరమణయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇంతటి బాధ్యతాయుతమైన పదవిని అప్పగించిన జాతీయ అధ్యక్షులు కేశవులు అర్థాల మరియు జాతీయ మహిళా అధ్యక్షురాలు అర్థాల ధన్యవాణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సంస్థ యొక్క ఆశయాలకు అనుగుణంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో గట్టిగా కృషి చేస్తానని, POHRF సంస్థకు మంచి పేరు తీసుకువచ్చేలా శ్రమిస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.