Logo
Date of Publish : 13 September 2026, 4:15 pm
Editor : Katta Ravindar

కార్పరేటర్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ

 

 

కరీంనగర్ తెలుగు సెప్టెంబర్ 13

 

 

 

బొమ్మకల్ ఆరవ డివిజన్ లో కార్పొరేటర్ మ్యకల వెంకటేష్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజలనుండి భారీ స్పందన వచ్చిందని కార్పొరేటర్ మేకల వెంకటేష్ తెలిపారు. రేపు ప్రారంభమవుతున్న వినాయక చవితి ఉత్సవాలలో ప్రజలందరూ మట్టి గణపతినీ ప్రతిష్టించి పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలని కార్పొరేటర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ పాలనలో కేంద్రమంతి బండి సంజయ్ కుమార్ ఆదేశాలతో మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో తొలిసారి 15000 కు పైగా మట్టి గణపతి ప్రతిమలను అన్ని డివిజన్ ల లో ప్రజలకు ఉచితంగా అందిసున్నమని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వాడటం వల్ల నీటిలో అవి కరగక జలచరాలకు ప్రాణాపాయం ఉందని మరియు కాలుష్యం భారీగా జరుగుతుందని ప్రజలు మట్టి విగ్రహాల వైపు మొగ్గు చూపాలని పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసే విగ్రహాల వల్ల జల వనరులు, పర్యావరణం తీవ్రంగా కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజలంతా మట్టి వినాయకులను పూజించి, పర్యావరణ హితంగా వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమల వైపు మొగ్గు చూపాలని, సంప్రదాయబద్ధంగా పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాయవేణి సదానందం , కాల్వ .రామచంద్రం ,పెద్ది లక్ష్మణ్, పోగుల సాయిచంద్, నేరెళ్ళ శశి , సంఘం అనిల్,పాదం. సాయి, తాత .రాజ్ కుమార్, మూతిక మల్లేష్, స్థానిక, యువకులు కాలనీవాసులు, డివిజన్ ప్రముఖులు మరియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మట్టి విగ్రహాలను స్వీకరించారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )