మహాదేవపూర్ K 24న్యూస్ మండలంలోని ఎల్కేశ్వరం గ్రామంలో
పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ ఎం. సాంబమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో రూ.2,100 నగదు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చట్టవిరుద్ధమైన జూదం, పేకాటకు సంబంధించిన సమాచారం ఉంటే 8712658116 నంబర్‌కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.