Logo
Date of Publish : 20 June 2026, 5:39 pm
Editor : Katta Ravindar

లాయర్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధారెడ్డి

కె24న్యూస్ తెలుగు జూన్ 20. చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని (వెంకటమణి ప్రసాద్) సతీమణి పులివర్తి సుధారెడ్డి విజయవాడలో జరిగిన అధికారిక సమావేశంలో ఏపీ బార్ కౌన్సిల్ నుంచి న్యాయవాద ఎన్రోల్‌మెంట్ పట్టాను అందుకున్నారు. ఇటీవల చంద్రగిరి మండలంలోని కెఎంఎం కళాశాల పరీక్షా కేంద్రంలో ఆమె ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్–21 (AIBE–21) పరీక్షకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ జాతీయ స్థాయి పరీక్షలో ఘన విజయం సాధించిన అనంతరం, విజయవాడలో బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అధికారిక సమావేశంలో ఆమె న్యాయవాదిగా రిజిస్టర్ చేసుకుని, చట్టబద్ధంగా తన ఎన్రోల్‌మెంట్ సర్టిఫికేట్‌ను స్వీకరించారు. నేటి నుంచి లాయర్ పులివర్తి సుధారెడ్డి లాయర్‌గా పట్టా పొందిన అనంతరం పులివర్తి సుధారెడ్డి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తన మనోభావాలను పంచుకున్నారు. నేటి నుంచి నన్ను నేను లాయర్ పులివర్తి సుధారెడ్డి అని చెప్పుకోవడం ఎంతో గర్వంగా, సద్భావంగా ఉంది. ఒక మహిళగా, భార్యగా, తల్లిగా, అత్తగా కుటుంబ బాధ్యతలు చక్కబెట్టడంతో పాటు, అటు పుట్టింటికి, ఇటు మెట్టినింటికి గౌరవాన్ని తెచ్చేలా మనల్ని మనం ఎప్పటికప్పుడు మలుచుకుంటూ ముందుకు సాగాలి అని ఆమె పిలుపునిచ్చారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )