కరీంనగర్ తెలుగు కే న్యూస్ 21 సెప్టెంబర్
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వినాయక నగర్ లో గణనాథునికి 41 రకాల మహా ప్రసాదాలు నివేదించారు భక్తులు భక్తి శ్రద్ధలతో లడ్డూలు, మోదకాలు, పులిహోర, పొంగల్, పండ్లు, కొబ్బరికాయలు, గారెలు తదితర 41 రకాల ప్రసాదాలను స్వామివారికి సమర్పించారు.
ఈ మహా ప్రసాద కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.