Logo
Date of Publish : 10 June 2026, 12:48 pm
Editor : Katta Ravindar

సిద్దిపేటలో గ్యాస్ సిలిండర్ల అక్రమ విక్రయాలపై చర్యలు తీసుకోవాలి

జిల్లా సివిల్ సప్లై అధికారిపై చర్యలు, అక్రమాలకు పాల్పడుతున్న గ్యాస్ ఏజెన్సీల లైసెన్సుల రద్దుకు బీఎస్పీ డిమాండ్ 

 

సిద్దిపేట, జూన్ 10 : సిద్దిపేట పట్టణంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న ఘటనలపై పలుమార్లు జిల్లా సివిల్ సప్లై అధికారులు దృష్టికి తీసుకెళ్లగా, ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించినట్లు ఆయన తెలిపారు. అక్రమంగా గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న వ్యక్తిని హ్యాండెడ్‌గా పట్టుకుని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు, వ్యక్తులపై లేదా, గ్యాస్ ఏజెన్సీలపై లేదా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన జిల్లా సివిల్ సప్లై అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అక్రమాలకు పాల్పడుతున్న గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులను వెంటనే రద్దు చేసింది.
ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నందున వెంటనే గ్యాస్ అక్రమ వ్యాపారంపై జిల్లా యంత్రాంగం స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పుల్లూరు ఉమేష్ విజ్ఞప్తి చేశారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )