Logo
Date of Publish : 05 September 2026, 3:32 pm
Editor : Katta Ravindar

సిద్ధార్థ పాఠశాల ఉపాధ్యాయులు దాసరి మనోహర్ రెడ్డికి ‘ఉత్తమ ఉపాధ్యాయ’ గుర్తింపు

కరీంనగర్ తెలుగు కె న్యూస్ . ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సిద్ధార్థ పాఠశాలలో పనిచేస్తున్న ప్రముఖ ఉపాధ్యాయులు దాసరి మనోహర్ రెడ్డి గారికి ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తింపు లభించింది. విద్యా రంగంలో ఆయన అందిస్తున్న అమూల్యమైన సేవలకు, విద్యార్థుల పట్ల ఆయనకున్న అంకితభావానికి గానూ పాఠశాల యాజమాన్యం ఈ గౌరవాన్ని ప్రకటించింది.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ స్వప్న గారు మాట్లాడుతూ.. దాసరి మనోహర్ రెడ్డి గారు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారని కొనియాడారు. తోటి ఉపాధ్యాయులకు ఆయన ఒక ఆదర్శంగా నిలిచారని, ఆయన సేవలు పాఠశాల అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయని ప్రశంసించారు. ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఆయనకు ఈ ఉత్తమ ఉపాధ్యాయ గుర్తింపు దక్కడం పట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )