
సిద్దిపేట: తెలుగు కే న్యూస్ టీచర్లు విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి అన్నారు. బాయ్స్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె, హాజరు నమోదు చేయకుండా వెళ్లిన టీచర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డీఈఓ రమేశ్‌కు విచారణ ఆదేశించి నివేదిక సమర్పించాలని సూచించారు. అనంతరం పాలమాకుల జడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి కామన్ డైట్ మెనూ పాటించాలని ఆదేశించారు.




