
నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండలం:- కొస్లీ గ్రామంలోని పశువుల ఆసుపత్రి సమీపంలో ఖాళీ బీర్ సీసాలు పడేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో మద్యం సీసాలు అక్కడక్కడా పడేయడం వల్ల స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.పర్యావరణానికి కాలుష్యం కలిగిస్తున్న ఈ చర్యపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.



