ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం* రెండో విడతలో 106 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

కామారెడ్డి జిల్లా అక్టోబర్1: k24 న్యూస్ తెలుగు : పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.

కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు ఎంపికైన దాదాపు 106 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులను అభినందించిన ఆయన, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.

ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం ఒక ఇల్లు కాదు.. ప్రతి పేద కుటుంబానికి ఆత్మగౌరవానికి ప్రతీక. సొంతింటి కల నెరవేర్చాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోంది” అని అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, యువతకు ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులకు సంక్షేమ కార్యక్రమాలు వంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.

పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. సంక్షేమంతో పాటు రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, పట్టణాభివృద్ధి వంటి రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి” అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

కామారెడ్డి పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన తెలిపారు. పట్టణంలోని రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం, విద్యా సంస్థలు, క్రీడా మైదానాలు తదితర రంగాల్లో అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. పేదలకు ఇల్లు, రైతులకు భరోసా, మహిళలకు ఆర్థిక సాధికారత, యువతకు ఉపాధి, విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని షబ్బీర్ అలీ అన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ నాణ్యమైన నిర్మాణాలను చేపట్టాలని, ఇళ్ల నిర్మాణంలో అధికారులు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆయన సూచించారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప శ్రీనివాస్ ఉమారాణి, వైస్ చైర్మన్ కాసార్ల గోదావరి,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్, కౌన్సిలర్లు వాజీద్, జావీద్, సావిత్రి, అఖిల, స్వప్న, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, యూనుస్, షేరు, అన్వార్, మన్సూర్, గంగాధర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :