మహిళా రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

అక్కన్నపేట: అక్టోబర్ తెలుగు కె న్యూస్.01

ATMA ఆధ్వర్యంలో మహిళా రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీమతి తస్లీమా సుల్తానా మరియు వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) శ్రీమతి సబీహా పాల్గొని మహిళా రైతులకు ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి తస్లీమా సుల్తానా మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం ద్వారా రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను పొందవచ్చని తెలిపారు. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం, స్థానికంగా లభించే సహజ వనరులను వినియోగించుకోవడం ద్వారా వ్యవసాయంలో స్థిరమైన దిగుబడులు సాధించవచ్చని వివరించారు.ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలు, విత్తన శుద్ధి, మల్చింగ్ వంటి పద్ధతుల ప్రాధాన్యతను రైతులకు వివరించారు. ఇంటి వద్ద లభించే సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వ్యవసాయ ఖర్చులను తగ్గించుకోవచ్చని సూచించారు.AEO సబీహా మాట్లాడుతూ, మహిళా రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించి తమ పొలాల్లో సురక్షితమైన, నాణ్యమైన ఆహార ఉత్పత్తులను పెంచడంతో పాటు నేల సారాన్ని కాపాడుకోవాలని సూచించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో మహిళా రైతులు పాల్గొని ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన పొందారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :