
కామారెడ్డి అక్టోబర్ 1 :k24 న్యూస్ తెలుగు:కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని నిస్వార్ధంగా అత్యవసర పరిస్థితుల్లో రక్తాన్ని అందజేస్తున్న రక్తదాతలు లక్కబత్తిని రవికుమార్ (దోమకొండ),ఎండి వాజిద్ (ఏ ఆర్ కానిస్టేబుల్),బద్దం నిశాంత్ రెడ్డి (భిక్నూర్), ఎండి జమీల్ అహ్మద్,పర్ష వెంకటరమణ లను కామారెడ్డి డి.ఎస్.పి మధుసూదన్ మరియు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా కామారెడ్డి డిఎస్పి మధుసూదన్ మాట్లాడుతూ రక్తదాతలు ప్రాణదాతలు అని ఆపదలో ఉన్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్లి రక్తదానం చేస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలిచిన రక్తదాతల సేవలు అభినందనీయమని 20 సంవత్సరాల డాక్టర్ బాలు ఆధ్వర్యంలో రక్తదానంలో చేసుకున్న సేవలను అభినందించడం జరిగింది.
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007 నుండి రక్తదాన కార్యక్రమాలను కామారెడ్డి నుండి ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావాల్సిన రక్తాన్ని అందజేయడం జరుగుతుందని, 20 సంవత్సరాల కాలంలో వేలాది యూనిట్ల రక్తాన్ని తల సేమియా బాధిత చిన్నారులకు 6000 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్స్ ఆఫ్ రికార్డు లను స్వచ్ఛందంగా ముందుకు వచ్చే రక్తదాతల సహకారంతోనే సాధించడం జరిగిందని అన్నారు.నిస్వార్ధంగా సేవ చేస్తున్న రక్తదాతలను అభినందించాల్సిన బాధ్యత సమాజం పైన ఉన్నదని అన్నారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు ఎండి జమీల్ అమ్మద్,తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యులు, ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరి మారుతి,రెడ్ క్రాస్ జిల్లా సభ్యులు కుసుమ శ్రీకాంత్, ఉపాధ్యక్షులు పర్ష వెంకటరమణ,ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, సలహాదారులు జలిగామ శ్రీకాంత్,రెడ్ క్రాస్ సభ్యులు, రక్తదాతలు పాల్గొనడం జరిగింది.





