జనసేన సమన్వయ కమిటీ సభ్యునిగా కె.చంద్రశేఖర్@చందు నియామకం!

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 06. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ బలోపేతం కోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియమించారు. ఇందులో భాగంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి కంజేరి చంద్రశేఖర్@చందు సమన్వయ కమిటీ సభ్యునిగా ఎంపికయ్యారు. పార్టీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో జనసైనికులను, వీర మహిళలను ఎన్నికలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ కమిటీలు పనిచేయనున్నాయి. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :