అక్రమంగా మట్టి తరలింపు: రెండు ట్రాక్టర్లు, జేసీబీ పట్టివేత

 

మంచిర్యాల జిల్లా జూలై 25 తెలుగు కే న్యూస్ ప్రతినిధి

జైపూర్ మండల పరిధిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు ట్రాక్టర్లతో పాటు ఒక జేసీబీని శనివారం స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఎస్సై భూమేష్ తెలిపిన వివరాల ప్రకారం… పెగడపల్లి చెరువు నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరు చెప్పి, ఒక ప్రైవేటు కంపెనీకి అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చెరువు వద్ద దాడులు నిర్వహించి, మట్టిని తవ్వుతున్న జేసీబీతో పాటు తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ తవ్వకాలకు తగిన అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై స్పష్టత కోసం కేసు వివరాలను స్థానిక తహశీల్దార్ వనజారెడ్డికి అందించినట్లు ఎస్సై వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మండల పరిధిలో అనుమతులు లేకుండా ఇసుక గానీ, మట్టి గానీ అక్రమంగా తరలిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని తేల్చి చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :