

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందుతూ రైతులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. గత ఐదు దశాబ్దాలుగా రైతుల వ్యవసాయాభివృద్ధికి ఈ పథకం కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు.
అలీసాగర్ ప్రాజెక్ట్ అభివృద్ధికి కృషి చేసిన ఇంజినీర్లు, సిబ్బంది, రైతులను నాయకులు అభినందించారు. భవిష్యత్తులో కూడా రైతులకు నిరంతర సాగునీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమం అనంతరం పథకం ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, రైతుల సంక్షేమం కోసం ఆకాంక్షించారు. అలీసాగర్ ఎత్తిపోతల పథకం 50 ఏళ్ల ప్రస్థానం రైతులకు స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడ్డారు.





