ఎస్‌ఐఆర్ సర్వేలో 100 శాతం పూర్తి.. బీఎల్‌వోలు, అధికారులకు ఘన సన్మానం

నిజామాబాద్ జిల్లా,డొంకేశ్వర్ మాడలంలో:- ఎస్‌ఐఆర్ సర్వేను 100 శాతం విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా మండల తహసీల్దార్, ఆర్‌ఐ ఆధ్వర్యంలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు), అంగన్‌వాడీ టీచర్లు మరియు సర్వేలో పాల్గొన్న సిబ్బందికి ఘన సన్మానం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాబురావు అధ్యక్షత వహించారు. సీనియర్ నాయకులు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బట్టు సంజీవరాజ్, మండల సూపర్వైజర్ దశ గౌడ్, చిన్న సాయన్న, గిఫ్ట్ చైర్మన్ పూజా రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు భూమేష్ రెడ్డి, హరిదాస్, సర్పంచ్ మహేష్ సక్కరి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వంశీ తదితరులు పాల్గొని ఎస్‌ఐఆర్ సర్వే విజయవంతం కావడంలో కృషి చేసిన అధికారులను, సిబ్బందిని అభినందించారు. మండల ఎమ్మార్వోతో పాటు వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :