కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ పాలిటెక్నికల్ మోడల్ స్కూల్ దారి గుంతలమయం.. విద్యార్థులకు నిత్యం అవస్థలు

నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండలంలోని :- పాలిటెక్నికల్ మోడల్ స్కూల్‌కు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్డు మరింత దెబ్బతిని, అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లే విద్యార్థి, విద్యార్థినులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోంది.
అంతేకాకుండా రహదారి పక్కన ఉన్న చెట్లు రోడ్డుపైకి వంగిపోవడంతో వాహనాల రాకపోకలకు కూడా ఆటంకం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు ఈ మార్గంలో వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ప్రమాదం జరిగేలోపు సంబంధిత అధికారులు స్పందించి రహదారిని మరమ్మతు చేయడంతో పాటు రోడ్డుపైకి వంగిన చెట్ల కొమ్మలను తొలగించి విద్యార్థులకు సురక్షితమైన మార్గాన్ని కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :