
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలోని ఎల్పుగోండ గ్రామంలో బిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తల సేమియా వ్యాధి చిన్నారుల కు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం వారి జీవితాంతం అవసరమవుతుందని,వారి ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నదని అన్నారు. రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు పర్ష వెంకటరమణ, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొంబోతుల రాజగౌడ్,యువజన విభాగం అధ్యక్షుడు పులిమామిడి దేవరాజు,సర్పంచ్ విద్యా సాగర్,ఉప సర్పంచ్ రవి,సాయి రెడ్డి,అంకం బాలకిషన్,తోట రామ్మోహన్,రామ్మూర్తి,నర్సింలు,ప్రశాంత్ రెడ్డి, భూపతి,రంజిత్ గౌడ్ లు పాల్గొనడం జరిగింది.








