

భవన నిర్మాణ పనులకు ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గైని వసంత సతీష్ మాట్లాడుతూ గ్రామంలోని చిన్నారులకు మెరుగైన విద్యా, పోషకాహార మరియు ఆరోగ్య సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. భవనం పూర్తయిన అనంతరం చిన్నారులకు మరింత అనుకూలమైన వాతావరణంలో సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోపి గౌడ్, పంచాయతీ కార్యదర్శి టి.ప్రియాంక, అంగన్వాడీ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి, హైస్కూల్ ప్రిన్సిపాల్ మల్లేష్ పాల్గొన్నారు. అలాగే వార్డు సభ్యులు లక్ష్మి నర్సవ్వ, శెట్పల్లి పవన్, బేతి రమ్య, కొండ్ర గంగాధర్, బేగరి సురేష్, అసది సవితతో పాటు గ్రామ పెద్దలు మారట నగేష్, గొల్ల గంగన్న, మంత గంగన్న, బొర్రా సురేష్, బేతి నారాయణరెడ్డి, అంతకోళ్ల శ్రీనివాస్, పులి సాయిలు, మంత సాయన్న, రెమ్మ పోచయ్య, కొండ్ర రాజు, చాకలి జనార్దన్, శాల నర్సయ్య తదితరులు హాజరయ్యారు.
గ్రామాభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ఈ అంగన్వాడీ భవనం నిర్మాణం చిన్నారుల విద్యా వికాసానికి, సంక్షేమానికి దోహదపడుతుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.





