స్మార్ట్ సిటీ పనులపై విచారణ జరిపించాలి: ఆర్‌పీఐ


కరీంనగర్, తెలుగు కే న్యూస్ జూలై 26: కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యత లోపించి రోడ్లు, మురుగు కాలువలు దెబ్బతిన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించి సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని బ్లాక్‌లిస్టులో చేర్చాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ డిమాండ్ చేశారు.
నగరంలో స్మార్ట్ సిటీ పనుల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపించిన ఆయన, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక అధికారితో విచారణ చేపట్టాలని కోరారు. విచారణ జరపకపోతే ఆర్‌పీఐ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి నివేదికను అధికారులకు అందజేస్తామని, అవసరమైతే ఆందోళనలు చేపట్టి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌పీఐ జిల్లా అధ్యక్షుడు కాశిపాక అజయ్, నగర అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారుకూరి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు గందె కొమురయ్య ముదిరాజ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :