SIR పూర్తి లక్ష్యంగా బీఎల్‌ఏలు పనిచేయాలి: కాట్‌పల్లి నగేష్ రెడ్డి

 

నిజామాబాద్ జిల్లా, బోధన్ నియోజకవర్గంలో నిర్వహించిన బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి డీసీసీ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను బోధన్ నియోజకవర్గంలో 100 శాతం పూర్తి చేసేలా బీఎల్‌ఏలు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
ప్రతి అర్హులైన ఓటరు వివరాలు నమోదు అయ్యేలా అప్రమత్తంగా వ్యవహరించాలని, పార్టీ శ్రేణులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ సర్వే ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, బోధన్ నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, బీఎల్‌ఏలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :