Constituency Incharge
5 hours ago
బసివరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు తప్పిన పెనుప్రమాదం
గంగాధరనెల్లూరు నియోజకవర్గం SRపురం మండలం బసివరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు ప్రమాదవశాత్తు కిందపడింది. ఆ సమయంలో పాఠశాలలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ తక్షణమే తగు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

