శ్రీఆనంద నిలయ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో అన్నదానం

కె24 న్యూస్ తెలుగు జూన్ 20. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లి గ్రామంలోని శ్రీఆనంద నిలయ అనాధ ఆశ్రమం సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకురాలు బండి కృష్ణవేణి నేతృత్వంలో ప్రతి శనివారం ఉదయం 10 నుండి 12 గంటల వరకు యోగా, ధ్యాన తరగతులు నిర్వహిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆర్టీఐ ఏఎస్ వ్యస్థాపకులు బండి పట్టాభిరెడ్డి, ఆర్టీఐ ఏఎస్ జాతీయ డైరెక్టర్ హరినాథ రెడ్డి, విజయ, బండి మాధవిలత, బాబు రెడ్డి, బండి దామోదర్ రెడ్డి మరియు గ్రామస్థులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :