

కె24 తెలుగు న్యూస్ జూన్ 16. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం వెల్కూరు గ్రామానికి చెందిన క్రాస్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ పి.భూపతి అనారోగ్యంతో కన్నుమూశారు. గత 32 ఏళ్లుగా ఆయన వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, దళిత గ్రామాల దత్తతకు విశేష కృషి చేశారు. ఆయన మృతి పట్ల పలు స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు మరియు కలిజవేడు నాశంపల్లి (AAW) గ్రామస్థులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.





