
కామారెడ్డి జిల్లా:k24 న్యూస్ తెలుగు : అంతంపల్లి గ్రామ శివారులో వ్యవసాయ భూమి ఉంది. తన పొలంలోని గదిలో బోర్ మోటార్ స్టార్టర్ బాక్స్‌ను ఉంచి, ప్రతిరోజూ పొలానికి వెళ్లి పరిశీలించేవాడు.
ఈ క్రమంలో 03-09-2026 సాయంత్రం సుమారు 05:30 గంటలకు బోర్ మోటార్ స్టార్టర్ బాక్స్‌ను పరిశీలించి, గదికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు 04-09-2026 ఉదయం సుమారు 06:00 గంటలకు పొలానికి వెళ్లి చూడగా, గది తాళం పగులగొట్టి ఉండటంతో పాటు స్టార్టర్ బాక్స్‌కు సంబంధించిన కేబుల్ వైర్ మరియు బోర్ మోటార్‌కు సంబంధించిన కేబుల్ వైర్లను కట్ చేసి దొంగిలించినట్లు గుర్తించాడు.
అదేవిధంగా పరిసర పొలాల్లోని బోర్ మోటార్ల కేబుల్ వైర్లను కూడా గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినట్లు గుర్తించి, భిక్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఆదేశాల మేరకు, కామారెడ్డి డీఎస్పీ పర్యవేక్షణలో, భిక్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్, భిక్నూర్ ఎస్హెచ్ఓ శ్రీ ఎస్. అనిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక పరిజ్ఞానం మరియు ఇతర ఆధారాలను విశ్లేషించిన పోలీసులు బోర్ మోటార్ కేబుల్ వైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించారు.
నిందితులు పరస్పరం పరిచయమై, వ్యవసాయ పొలాల్లోని బోర్ మోటార్ కేబుల్ వైర్లను రాత్రి సమయంలో దొంగిలించి, వాటిని పెట్రోల్‌తో కాల్చి రాగి తీగలను వేరు చేసి స్క్రాప్ షాపుల్లో విక్రయించి డబ్బు సంపాదించాలని పథకం రూపొందించుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఈ క్రమంలో ఉగ్రవాయి గ్రామం, బస్వాపూర్ గ్రామ శివారు మరియు అంతంపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో బోర్ మోటార్ కేబుల్ వైర్లను దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది.
నిందితుల పాత్ర
A3 బిచగాని @ అండాసి శ్రీకాంత్ – ఇనుప రాడ్‌తో పొలంలోని గదికి ఉన్న తాళాన్ని పగులగొట్టాడు.
A4 బంటు రామ్ చరణ్ – స్టార్టర్ కేబుల్ మరియు బోర్ మోటార్ వద్ద ఉన్న కేబుల్ వైర్లను కట్టర్‌తో కట్ చేశాడు.
A1 బోరెడ్డి నరేందర్ రెడ్డి మరియు A4 బంటు రామ్ చరణ్ కలిసి పక్కనున్న బోర్ మోటార్ల కేబుల్ వైర్లను కట్ చేసి దొంగిలించారు.
A2 మోహన్ – దొంగిలించిన కేబుల్ వైర్లను పెట్రోల్‌తో కాల్చి, వాటిలోని రాగి తీగలను వేరు చేసినట్లు విచారణలో వెల్లడైంది.
నిందితుల వివరాలు
1. బోరెడ్డి నరేందర్ రెడ్డి
2. మోహన్ @ బైరాం మోహన్ @ రాజు
3. బిచగాని @ అండాసి శ్రీకాంత్
4. బంటు రామ్ చరణ్
05-09-2026న దొంగిలించిన కేబుల్ వైర్ల నుండి వేరు చేసిన రాగి తీగలను స్క్రాప్ షాపులో విక్రయించి, వచ్చిన డబ్బును నలుగురూ పంచుకున్నారు. అనంతరం భిక్నూర్ ప్రాంతంలో మరిన్ని బోర్ మోటార్ కేబుల్ వైర్లను దొంగిలించేందుకు నిందితులు వెళ్తుండగా, భిక్నూర్ బస్టాండ్ వద్ద పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించారు.
వారిని CCS కామారెడ్డి కానిస్టేబుళ్లు స్వామి, మైసయ్య, చేతన్, శ్రీకాంత్ మరియు భిక్నూర్ పోలీస్ కానిస్టేబుళ్లు సంగమేశ్వర్, సేవ్య, కిషన్, శ్రీకాంత్ కలిసి అప్రమత్తంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు
దొంగిలించిన కేబుల్ వైర్ల నుండి వేరు చేసిన రాగి తీగలు
కేబుల్ వైర్లు కట్ చేయడానికి ఉపయోగించిన కట్టర్లు
గది తాళం పగులగొట్టడానికి ఉపయోగించిన ఇనుప రాడ్
మొబైల్ ఫోన్ కేబుల్ వైర్లను కాల్చడానికి ఉపయోగించిన వస్తువు
నిందితులను అరెస్ట్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయస్థానం ఎదుట హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
వ్యవసాయ పొలాల్లోని బోర్ మోటార్లు, కేబుల్ వైర్లకు రైతులు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని భిక్నూర్ పోలీసులు సూచించారు.
ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన CCS కామారెడ్డి మరియు భిక్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్, భిక్నూర్ యస్ ఐ అనిల్ మరియు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.






