
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వివాహిత.. తన ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తెను వెంట తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో రైల్వే పట్టాల వద్దకు చేరుకుంది.
సాయంత్రం డయల్-112కు అందిన సమాచారం.. ఓ తల్లి, ఇద్దరు చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం ఉందని పోలీసులకు తెలిపింది. వెంటనే కామారెడ్డి టౌన్ ఇన్‌స్పెక్టర్ నరహరి ఆదేశాలతో బ్లూకోల్ట్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. క్షణం ఆలస్యం చేయకుండా రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుని, ఆమెను గుర్తించారు.
పోలీసులు ఆందోళన చెందకుండా ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు. పరిస్థితిని అర్థం చేసుకుని ధైర్యం చెప్పారు. చివరకు ఆమె నిర్ణయం మార్చుకునేలా చేసి, తల్లి ఇద్దరు చిన్నారులను సురక్షితంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు.
అనంతరం ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి, జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఆత్మహత్య పరిష్కారం కాదని, కుటుంబంతో కలిసి సమస్యలను అధిగమించాలని సూచించారు. సమయస్ఫూర్తితో స్పందించి మూడు ప్రాణాలను కాపాడిన కామారెడ్డి టౌన్ పోలీసుల సేవలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అభినందించారు.
డయల్-100 కాల్ చేసి మూడు ప్రాణాలకు రక్షణ.కాపాడారు
ఆపదలో అండగా.. ప్రజలకు భరోసాగా కలిపిస్తామని పోలీసులు తెలిపారు
ప





