
కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 06. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ బలోపేతం కోసం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియమించారు. ఇందులో భాగంగా గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుంచి కంజేరి చంద్రశేఖర్@చందు సమన్వయ కమిటీ సభ్యునిగా ఎంపికయ్యారు. ఈ సందర్బంగా తోట శ్రీనివాసులు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా సత్కారించారు.ఈ సందర్భంగా చందు సేవా దృక్పథాన్ని, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ప్రజాసేవలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరారు.






