
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : హైదరాబాద్ కొత్తపేటలో ఆల్ ఇండియా వర్కర్స్ పార్టీ (AIWP) తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర మహాసభల్లో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
ఈ మహాసభల్లో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వడ్ల సాయికృష్ణను తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు.
ఈ సందర్భంగా వడ్ల సాయికృష్ణ మాట్లాడుతూ.. “నాపై నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన తెలంగాణ రాష్ట్ర కమిటీకి మరియు అనుబంధ సంఘాల విభాగాలకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఆల్ ఇండియా వర్కర్స్ పార్టీ పోటీలో ఉంటుంది” అని తెలిపారు.






