భూ సమస్య తీర్చాలని సెల్ టవర్ ఎక్కిన బాధితుడు

తెలుగు కేన్యూస్ సెప్టెంబర్ 07  తనకు చెందిన భూ సమస్యను అధికారులు జిల్లా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్, గన్నేరువరం మండలం, చాకలివానిపల్లె(కూనవానిపల్లె) గ్రామానికి చెందిన కూన సతీష్ అనే వ్యక్తి సోమవారం గన్నేరువరం మండల కేంద్రంలో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.బాధితుడు కూన సతీష్‌తెలిపిన వివరాల ప్రకారం… తనకు చెందిన పట్టా స్థలంలో ఇల్లు నిర్మాణం చేపడుతున్నాడని పక్కనే ఉన్న కూన మల్లయ్య అనే వ్యక్తి అడ్డుపడుతున్నాడని ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు, విన్నవించినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదని సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ,ఎమ్మార్వో, ఎంపీడీవో అధికారుల చుట్టూ రెండు నెలల నుంచి తిరిగినా ఫలితం.తనకు న్యాయం జరిగే వరకు సెల్ టవర్ దిగేది లేదని స్పష్టం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సతీష్‌తో ఫోన్‌లో మాట్లాడి, భూ సమస్యను తక్షణమే పరిశీలించి న్యాయం హామీ ఇచ్చారు. అధికారుల హామీతో కూన సతీష్ కిందకు దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అధికారుల నిర్లక్ష్యం

అలసత్వంతో విసిగిపోయిన రైతులు భూ సమస్యల కోసం తరచూ సెల్‌టవర్లు ఎక్కేందుకు .సెల్ టవర్లు ఎక్కితేనే భూ సమస్య పరిష్కారం అని అందరూ చర్చించుకుంటున్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :