డ్రగ్స్ రహిత సమాజం కొరకు అందరూ పాటుపడాలి.. రేపటి సమాజం మీదే.. మీరే నడుం బిగించాలి. మత్తు పదార్థాల ను నిర్మూలించడం విద్యార్థులకే సాధ్యం

నిజామాబాద్ జిల్లా, నందిపేట మండల కేంద్రంలో :-పద్మశాలి కళ్యాణ మండపంలో సోమవారం జిల్లా ఈగల్ టీం ఆధ్వర్యంలో మండల కేంద్ర విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్ధాలను కళ్ళకు కట్టినట్టు ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ… దేశానికి యువత యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ మత్తు పదార్థాల నిర్మూలనకై ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సూచించారు. ఈగల్ టీం అడ్వైజర్ కొండవీటి శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ…. నేటి సమాజంలో మత్తు పదార్థాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని మరీ ముఖ్యంగా యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని, మత్తు పదార్థాలు ఉబిలో చిక్కుకొని యువత తన బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయని, విద్యార్థులను చైతన్య పరుస్తేనే డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణం అవుతుందని, అందుకు విద్యార్థులంతా ఈ డ్రగ్స్ మహమ్మారి అంతానికి చేతులు కలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ… ఈగల్ టీం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ చక్కటి కార్యక్రమానికి మండల కేంద్ర విద్యార్థులంతా రావడం చాలా సంతోషమని డ్రగ్స్ రహిత సమాజం కొరకు ముఖ్య పాత్రగా పోలీసులు కృషి చేస్తున్నారని, కానీ మత్తు పదార్థాల మహమ్మారిని అంతమొందించాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలని మరీ ముఖ్యంగా విద్యార్థులు ముందు వరుసలో నిలబడాలని, అప్పుడే నేటి సమాజానికి రేపటి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయచ్చని తెలిపారు. ప్రతిరోజు ఎన్నో సమస్యలను చూస్తుంటామని, వాటిని పరిష్కరిస్తుంటామని, కానీ మత్తు పదార్థాల కు విద్యార్థులు బానిసలై నేరాల బాటలు పడుతూ… ఉజ్వలమైన భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నప్పుడు, అటువంటి సమస్యలను చూస్తున్నప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుందని, దయచేసి తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని, ప్రతి విద్యార్థి తమతమ కుటుంబ సమస్యలను గుర్తెరిగి చెడు స్నేహాలను దూరం పెడుతూ, చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రమశిక్షణతో మంచి లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు పరిగెడుతున్న సమయంలో మనం కూడా పరుగెట్టాల్సిందేనని, ఈ పరుగులో విద్యతోపాటు మంచిక్రమశిక్షణ ఉన్నప్పుడే ఉన్నతమైన లక్ష్యాలను ఛేదించవచ్చని తెలిపారు. ఈగల్ టీం సభ్యులు, మండల కేంద్ర పాఠశాలల ఉపాధ్యాయులు, గీత కాన్వెంట్, కృష్ణవేణి, సిద్ధార్థ, నవోదయ, ఉజ్వల, సూర్యోదయ, అక్షర, ప్రభుత్వ ఇంగ్లీష్, తెలుగు,ఉర్దూ మీడియాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :